బీహార్లో అసెంబ్లీ రద్దుకే మంత్రివర్గం మొగ్గు

February 07, 2015 | 04:14 PM | 17 Views
ప్రింట్ కామెంట్
Jitan_ram_decided_to_dissolve_assembly_niharonline

బీహార్ లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో జితన్ రాం మాంఝీ శనివారం అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 2/3 శాతం మంది మంత్రులు ఆయన్ను వ్యతిరేకిస్తుండగా, మాజీ సీఎం నితీశ్ కుమార్ కు అనుకూలంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీ ని రద్దుచేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ రద్దు కొరుతూ రాష్ట్ర గవర్నర్ ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు త్వరలో మాంఝీ రాజీనామా చేస్తారని సమాచారం. మరోవైపు సమావేశం కంటే ముందే నితీశ్ కుమార్ ను పాట్నాలోని ఆయన నివాసంలో మాంఝీ కలుసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ