లేడీస్ వర్సెస్ జెంటిల్మెన్

August 21, 2015 | 11:04 AM | 1 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_versus_sonia_gandhi_in_indian_politics_niharonline

ఓ పాపులర్ టీవీ చానెల్ ఇంటర్య్వూ లో ప్రముఖ బాక్సర్ జోయ్ ఫ్రెజర్ మరోక లెజెండ్ మహముద్ ఆలీ గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. రింగ్ లోనే కాదు బయట కూడా మీ ఇద్దరు బద్ధ శత్రువలట కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... ‘అవును... మా ఇద్దరి మధ్య ఆట లోనే ఫైటింగ్ ఉండదు. వ్యక్తిగతంగా కూడా మా ఇద్దరికి వైరం ఉంది. అందుకే కాబోలు మా ఇద్దరికి ఎప్పటికీ పడదు అని వ్యాఖ్యానించాడు. అతను సరదాగా అన్నాడో... సీరియస్ గా అన్నాడో తెలీదు గానీ ఇప్పుడది మన దేశంలో జరిగే రాజకీయాలకు సరిగ్గా సూటవుతుంది.

                          దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వీరద్దరికి ఈ పరిస్థితులు చక్కగా ఆపాదుతాయి. పార్లమెంట్ వర్షకాల సమావేశాలను విఫలం చేయటంలో విజయవంతమై బీజేపీకి కుక్క కాటుకి చెప్పుదెబ్బ ఇచ్చాం అని కాంగ్రెస్ ఫీలవుతుంది.  అదే సమయంలో మోదీ సోనియాలు వారి మధ్య ఉన్న వ్యక్తిగత వైరాన్నిస్పష్టంగా బయటపెట్టారు. అసలు ఇంతకు ముందు ఇలాంటి వైరాలు అసెంబ్లీలో మాత్రమే కనిపించేవి. తమిళనాడులో జయ వర్సెస్ కరుణానిధి, యూపీలో ములాయం వర్సెస్ మాయావతి, బెంగాల్ లో మమతా వర్సెస్ లెఫ్ట్ ఈ కోవకు చెందినవే. అయితే వారి విమర్శలు ఆయా రాష్ట్రాలకే పరిమితం కావటంతో పెద్దగా మాట్లాడుకునేందుకు ఆస్కారం లేకపోయింది. కానీ, ఇప్పుడిది జాతీయస్థాయిలోకి చేరడం వల్ల మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది.

                 సోనియాగాంధీ, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి వ్యక్తిత్వాలు ఉన్న నేతలు. ఒక విదేశీయురాలు అయినప్పటికీ భారతీయ రాజకీయాలను అవపోసన పట్టేసి నెహ్రూ ఇంటి కోడలికి దేశ ప్రజల మన్ననలు పొంది యూపీఏ రెండు సార్లు అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించింది సోనియా.  ఓవైపు నుంచి వారసుడు రాహుల్ ను వెలుగులోకి తేవాలన్న తాపత్రయంతోపాటే, పతనమైపోతున్న పార్టీని కాపాడుకోవటం ఆమె ముందున్న లక్ష్యాలు. అదే సమయంలో ప్రభుత్వాన్ని ఏకీ పారేయడం కూడా అవసరమే. ఇక మరో వైపు నరేంద్ర మోదీ. ఒకే ఒక్కడిగా నడిచి పాతళం నుంచి పార్టీని పైకి తెచ్చి అధికార పీఠంపై కూర్చోబెట్టిన వ్యక్తి. అశేష జనాభిమానం సంపాదించుకుని అరుదైన నేతగా కీర్తిగడించాడు. కానీ ఇప్పుడు వీరిద్దరు అనుసరిస్తున్న వ్యూహాలు అదో రకంగా ఉంటున్నాయి. వీరిద్దరికీ ఇదేం కొత్త కాదు. గతంలో 2007 ఎన్నికల ప్రచారంలో సోనియా మోదీపై చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2002 గుజరాత్ అల్లర్లను అవకాశంగా తీసుకుని సోనియా చేసిన వ్యాఖ్యలను చిల్లర గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు. అయినా అవేం ఫలించకపోగా మోదీ విజయానికి మరింత దోహదం చేశాయి. ఇఫ్పుడు అదే సీన్ రిపీట్ అవుతున్నా... అది వారిద్దరి నుంచి సమాన స్థాయిలో వస్తున్నాయి.  పార్టీని పరిరక్షించుకోవాలని కానీ, అందుకోసం విషయాలను వ్యక్తిగతం చేసుకుని వ్యక్తిత్వాలను పాడుచేసుకోవద్దు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ