ఆ సూట్ కంత సీన్ లేదట

February 18, 2015 | 01:24 PM | 23 Views
ప్రింట్ కామెంట్
modi_suit_niharonline

గత నెలలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్య అతిధిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతోసహా అందరి ద్రుష్టిని ఆకర్షించేందుకు దాదాపు రూ.10లక్షలతో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే పేరును ఈ సూట్ పై చేర్చి ప్రత్యేకంగా రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సూట్‌తోపాటు గడిచిన తొమ్మిది నెలలుగా ప్రధానికి కానుకలుగా అందిన 455 వస్తువులను కూడా వేలానికి పెట్టనున్నారు. ఇలా వచ్చిన సొమ్మును బాలికా విద్యకోసం నమామి గంగా ట్రస్ట్ ఫండు కు విరాళంగా ఇవ్వనున్నారు. అంతేకాదు రికార్డు ధరలో ఇప్పటిదాకా కోటి రూపాయలకు అమ్ముడుపోయేందుకు ఈ సూట్ రెడీగా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే మోదీకి ఈ సూటును బహుకరించిన ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ కుమార్ బికాబాయ్ విరానీ ఇప్పుడో విషయం చెప్పి అందరిని షాక్ కి గురిచేశాడు. అసలు ఆ సూటుకు రూ.10 లక్షలు కాదని అతను అంటున్నాడు. గుజరాత్ వైబ్రెంట్ సదస్సు సందర్భంగా మోదీని కలిసిన రమేష్ ఆయనకు ఆ సూటును బహుకరించాడట. జనవరి 26న ఆయన తనయుడు స్మిత్ విరానీ వివాహ వేడుక ఉంది. దానికి హాజరు కావాల్సిందిగా మోదీని ఆహ్వనించేందుకు వెళ్లేప్పుడు తన కుమారుడు ఆ సూటును మోదీకిచ్చి సర్ ప్రైజ్ చేయాల్సిందిగా తనతో చెప్పాడట. అందుకే ఆ సూటును మోదీకి ఇచ్చానని రమేష్ చెప్పాడు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల రాలేనన్న మోదీ కానీ ఆరోజు తప్పకుండా ఆ సూటును ధరిస్తానని మాటిచ్చాడట. అన్నమాట ప్రకారం మోదీ ఆ రోజు ఆ సూటును ధరించాడని రమేష్ చెప్పాడు. అయితే ఆ సూటు ధర రూ.10 లక్షలు మాత్రం ఉండదని ఆయన అంటున్నాడు. నా కుమారుడికి అంత ఖర్చుపెట్టే ధైర్యం లేదు. కానీ, ఓ మంచి కార్యం కోసం ఆ సూట్ భారీ ధరకు అమ్ముడు పోతే మంచిదేకదా అని అంటున్నాడీ వ్యాపారవేత్త.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ