ఆపరేషన్ ఆకర్ష్ వాట్ నెక్స్ట్

March 01, 2016 | 04:09 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Jagan-party-more-defections-niharonline

ఏపీలో ప్రతిపక్ష నేత జగన్ కి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యాండిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యే అధికార టీడీపీలోకి చేరిపోతున్నారు. ఆఖరికి జగన్ సహా పార్టీలోని ప్రధాన నేతలు ఎందరు అడ్డుకుంటున్నా ఈ వలసలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కర్నూలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియలతో మొదలైన ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మంగళవారం టీడీపీలోకి జంప్ కొట్టారు.

వీరంతా చెబుతున్నది ఒకటే మాట. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారుతున్నామని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరమూ శ్రమిస్తున్నారని, ఆయనకు మద్దతుగా నిలిచేందుకు పార్టీ మారుతున్నామని స్పష్టం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి పార్టీ అధినేత జగన్ వైఖరే, ఫిరాయింపులకు కారణమని ఆరోపిస్తున్న నేతలు కూడా ఉన్నారు. ఇక కర్నూలు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఎమ్మెల్యేలు వలసబాట పట్టారు. ఆయా జిల్లాలకు చెందిన మరో 8 నుంచి 10 మంది వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

               జగన్ ఫిరాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తే 10 మంది హాజరు కాని సంగతి తెలిసిందే. దీంతో వీరింతా టీడీపీలోకి దూకుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. భూమా కుటుంబం తరువాత కృష్ణా జిల్లాకు చెందిన జలీల్ ఖాన్, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన డేవిడ్ రాజు సహా ఇప్పటివరకూ ఏడుగురు ఎమ్మెల్యేలు వైకాపాలోకి చేరిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ