బాబూ... మోత్కుపల్లి ప్రశ్నకు ఆన్సర్ ఏది?

March 01, 2016 | 11:30 AM | 4 Views
ప్రింట్ కామెంట్
mothukupalli-to-Chandrababu-Naidu- Defections-in-AP-niharonline

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతున్న టైంలో కంటతడి పెట్టి తన బాధను వ్యక్తం చేశాడు సీనియర్ నేత మోత్కుపల్లి. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ పరిస్థితి నేడు ఇంతదారుణంగా అయ్యిందా అని ఆవేదన వ్యక్తం చేశాడాయన. ఆపై మిగిలిన వారి జంపింగ్ లతో పార్టీ శకం దాదాపు ముగిసినట్లయ్యింది. అదే టైంలో తన పట్ల అధినేత పట్టించుకోనట్లు ఉండటంతో మోత్కుపల్లి కూడా పార్టీ మారతారనే వదంతులు వినిపించాయి. అవి పక్కన బెడితే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆయన గట్టి ఝలకిచ్చారట.

                                            మ్యాటరేంటంటే... సోమవారం విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నేతలతో పాటు టీ టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో అసహనానికి లోనైన మోత్కుపల్లి కలుగు జేసుకున్నారంట. ఏపీలో వైసీపీ నుంచి నేతలను లాక్కొవటం పై ఆయన తన అసంతృప్తిని వెల్లగక్కారు. ‘‘పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ది, మీది ఒకే విధానం’’ అని పెద్ద తేడా లేదనేసరికి అక్కడున్న వారంతా షాక్ తిన్నారంట. అయితే మోత్కుపల్లి వ్యాఖ్యలకు తొలుత స్పందించని చంద్రబాబు ఆ తర్వాత చిన్నగా నవ్వి ‘‘పార్టీ ఫిరాయింపులు ఇప్పుడేమీ కొత్త కాదు. ఏన్నో ఏళ్లుగా కొనసాగుతున్నదే’’ అని బదులిచ్చారంట. మోత్కుపల్లి పార్టీ మారతారా లేదా అన్నది పక్కన బెడితే, ఏపీ ఫిరాయింపులపై ఓ తెలంగాణ సీనియర్ నేత అధినేతపై చేసిన వ్యాఖ్యలు పార్టీని కాస్తంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ