ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత ఆయనేనట!

October 30, 2015 | 11:32 AM | 5 Views
ప్రింట్ కామెంట్
narayana-complete-response-for-amaravathi-after-chandrababu-niharonline

సాధారణంగా ఏపీ సీఎం చంద్రబాబు అధికారం విషయంలోగానీ, పాలనా విషయంలో గానీ పక్కనున్నవారిని ఎవరినీ నమ్మరు. సలహాల వరకైతే స్వీకరిస్తారు గానీ ఆఖరికి సీనియర్లను కూడా కీలక నిర్ణయాల భాగస్వాములను చెయ్యరు. మరి అలాంటిది నమ్మి మంత్రి నారాయణకు రాజధాని నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నారాయణ ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వతహాగా రాజకీయ నేత కాకపోయినప్పటికీ పాలనాపరంగా బాబుకు తల్లో నాలుకగా వ్యవహారిస్తున్నారు నారాయణ. ఈ విషయంలో పలువురు సీనియర్లు కూడా బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతున్నారు కూడా.  

ఈ క్రమంలో ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ దగ్గర నుంచి రాజధాని కాంట్రాక్టర్ ను నిర్ణయించడం, మాస్టర్ ప్లాన్ తదితరాల్లో నారాయణదే కీలక భూమిక. ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబునాయుడు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా, నారాయణ మాత్రం రాజధాని నిర్మాణం మొత్తం బాధ్యత తనదే అన్నట్లుగా అహరహం శ్రమిస్తున్నారు.

తన సొంత జిల్లా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం విషయంలో సీఎం తర్వాత బాధ్యత మొత్తం తనదేనని ఆయన చెప్పారు. సీఆర్డీఏలో తనదే హవా అంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, రాజధాని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని కూడా నారాయణ ప్రకటించారు. అంతేగానీ ఆయనే తర్వాతి ముఖ్యమంత్రి అని కాదు లేండి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ