బాబుకి షాకిచ్చిన నేషనల్ మీడియా

December 18, 2015 | 02:06 PM | 4 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-zee-news-article-about-call-money-niharonline

నవ్యాంధ్ర రాజకీయ రాజధాని బెజవాడలో వెలుగుచూసిన కామ(కాల్ మనీ) దందా అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పలువురు బడా నేతల పేర్లు వెలుగులోకి రావటంతో రాజకీయ రచ్చ రగులుకోనగా, ఎక్కడ తమ పేర్లు బయటికి వస్తాయోనని అధికార పక్ష నేతలతోసహా అంతా ఉలిక్కి పడుతున్నారు. ఇక ఈ కామ ధాటికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు చిక్కుల్లో పడ్డారట. విపక్షం డిమాండ్లకు తలొగ్గిన చంద్రబాబు ఈ దందాపై న్యాయవిచారణకు ఆదేశించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.

                              ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని రాసింది. ఇళ్లు, ఇతర వస్తువులను తనఖా పెట్టుకుని సింగిల్ ఫోన్ కాల్ తో రుణాలిచ్చేసిన కాల్ మనీ రాకెట్ వసూళ్లలో బరి తెగించిన వైనంపైనా ఆ కథనం సవివరంగా తెలిపింది. రుణ వసూళ్లలో కఠినంగా వ్యవహరించిన కాల్ మనీ నిర్వాహకులు మహిళలను వ్యభిచార కూపంలోకి లాగేశారని, ఈ దందాకు రాజకీయ నేతల మద్దతు కూడా ఉందని పేర్కొంది. ప్రధానంగా అధికార టీడీపీకి చెందిన పలువురు నేతలకు ఈ దందాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో విపక్షం విరుచుకుపడింది. దీంతో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయక తప్పలేదు అని ఆ కథనం సారాంశం. కీలకనేతలు కూడా ఇందులో భాగస్వామ్యం కావటం, వారంతా మొరపెట్టుకున్నారు గనకే చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదంటూ అందులో తెలపటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ