తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబుతున్నాయన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నాయని నాయిని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు జరిపిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులు పోలీసుల వద్ద ఉన్నాయని నాయిని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చివర్లో తనదైన శైలిలో ఆయన ముగించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి.