పార్లమెంటు ముట్టడి, అసెంబ్లీపై దాడి లాంటి మాటలు రోజువారి జీవితంలో విని అలవాటు పడిపోతున్నాంగానీ వాటి అర్థాలు సీరియస్ గా పట్టించుకుంటే దేశ ద్రోహ నేరం క్రింద పరిగణించి అండమాన్ పంపించేయడమో, దేశ బహిష్కరణ చేయడమో చెయ్యాలి!
ఖాళీగా పనిపాటలేక సెక్రటేరియట్ దర్వాజకు అడ్డంగ నిలబడితే స్టేషన్ లో పెట్టక ఏం చేస్తరు. మంచి శాస్తి జరిగింది. మూస్కోండి అని ప్రతిపక్షాలకు ఫుల్లుగా క్లాసు పీకేరు కేసీఆర్. పనికి మాలిన పన్లు, దిక్కుమాలిన దందాలు మానుకోండి అన్నారు. దేశంలో మా తెలంగాణ నంబరు వన్ గా ఉంటుంటే కుళ్లుకుంటున్నారు అని మందలించేరు. దీనికేం చెయ్యలేక కొత్త తిట్టు దొరక్క అదే దిక్కమాలిన మాటనే ఆయనపైనే ప్రయోగించి కామ్రేడ్లు తృప్తి చెందుతున్నారు. కేసీఆర్ కి ఈ ప్రవచనాలు, బాషా సౌందర్యం కొత్తేంకాదు. కాని గోబెల్స్ లా పదేపదే దిక్కుమాలిన లాంటి మాటల్ ప్రతిపక్షాలు హైజాక్ కబ్జా చేసేలా ఉంది.