రైతు భూముల కోసం పవన్ దీక్ష

May 20, 2015 | 03:08 PM | 140 Views
ప్రింట్ కామెంట్
pawan_deeksha_niharonline

గతంలో ఏపీ రాజధాని ప్రాంతాల్లో పర్యటించిన జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ రైతుల నుంచి భూమిని సేకరించే విషయంలో అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిపిందే. రైతన్నలకిచ్చిన ఆ మాటకు కట్టుబడే  పవన్ కల్యాణ్ మే 23న దీక్ష ప్రారంభిస్తారని సమాచారం. రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కుంటే... తాను కలుగజేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పవన్ కల్యాణ్ ఏపీ సర్కారును హెచ్చరించినట్టు సమాచారం.  అయితే రైతు భూముల కోసం దీక్ష చేసే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు  ప్రత్యేక హోదా డిమాండ్‌ను కూడా అజెండాలో చేర్చుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రైతు భూములను కాపాడేందుకు పవన్ దీక్ష చేస్తున్నారని... పనిలో పనిగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తితే కేంద్రం నుంచి మంచి స్పందన వచ్చే ఛాన్సుందని రాజకీయ వర్గాల అభిప్రాయం.  పవన్ కల్యాణ్ దీక్ష గుంటూరు జిల్లాలోని రాయపుడి లేదా బేటాపుడిలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీక్షకు సంబంధించి ఇప్పటికే పవన్ కల్యాణ్ సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారు, 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ