పవన్ పిట్ట కూతలు ఇంకేంతకాలం?

April 30, 2016 | 04:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
pawan-kalyan-twitter-response-on-AP-special-status-niharonline

ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన గురించి వేచి చూస్తున్నామన్న అధికార నేతల మాటలకు తూట్లు పొడుస్తూ పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని బహిరంగంగానే ప్రకటన చేసింది.  ఇంతకాలం ఊరిస్తూ వస్తు ఇప్పుడు సారీ అని సింపుల్ గా చెప్పటంతో అధికార టీడీపీకి సైతం మింగుడుపడటం లేదు. దీంతో విపక్షాలన్నీ కేంద్రం పై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో  రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్న ప్రముఖ సినీ హీరో, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, పవన్ కల్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. ఈ మేరకు పవన్ తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. 'ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలి, సీమాంధ్ర ప్రజల నమ్మకాన్ని బీజేపీ వమ్ముచేయదని ఆశిస్తున్నా'నని అన్నారు. కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసిందని, పార్లమెంటులో ఎంపీలను బయటకు గెంటి రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమించేలోపే మన అధికార, ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పవన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే నూతన రాజధాని,  భూసేకరణ లాంటి విషయాల్లోనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు స్పీచ్ లు దంచిన పవన్ కు కీలకమైన ప్రత్యేకంపై నేరుగా కేంద్రం దగ్గరికి వెళ్లే సమయం దొరకట్లేదా అన్నది ఇప్పుడు మిగతా నేతల వద్ద నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడే ఉండి ఇలా మీడియా సమావేశాలంటూ, ట్విట్టర్ అంటూ కూతలు కూయకపోతే, డైరక్ట్ గా ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒక్క దుమ్ము దుళిపితే ప్రత్యేకంపై ఏదో ఒకటి తేలుతుంది కదా అని వారు సలహా ఇస్తున్నారు. ఓవైపు శివాజీ లాంటి చిన్న హీరోలు ప్రత్యేకంపై పోరాటం చేసే దిశగా కదులుతుంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్న పవన్ కి ఇది కాస్త ఇబ్బంది కలిగించే అంశమే మరీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ