డియర్ రోజా... పవర్ పంజా తట్టుకోలేవ్!

August 11, 2015 | 12:29 PM | 8 Views
ప్రింట్ కామెంట్
pawan_kalyan_roja_comments_niharonline

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైకాపాలో ఫైర్ బ్రాండ్ గా పేరు పెంచుకోంటోది రోజా. పదునైన మాటలతో అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతూ రాజకీయాల్లో రాటు దేలాలన్న రోజా ప్రయత్నం అభినందనీయమే. ముఖ్యమంత్రి చంద్రబాబు ను కూడా ఆమె వదలకుండా ఏకీ పడేస్తూ రాణిస్తుంది. అయితే అది లిమిట్ క్రాస్ అయితే పరిస్థితి ఏంటనేది  ఆమె ఆలోచించట్లేదు. ఈ క్రమంలో నోరు తెగ జారిపోతుంది. తాజాగా ప్రత్యేక హోదా సాధనకై వైకాపా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఇందులో ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.

                                     ఈ సందర్భంగా  జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రోజా మాటల తుటాలు పేల్చారు. పవన్  ప్యాకేజీ అందుకున్నావా... ఎంత అందుకున్నావ్ అంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందే టీడీపీ-బీజేపీ కూటమికి విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లేయించిన ఆయన ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి ఫ్యాకేజీ అందుకుని పూర్తిగా ప్రశ్నించడం మానేశారని ఆమె దుయ్యబట్టారు. ప్యాకేజీ అందుకున్న కారణంగానే ఆయన కిక్కురుమనకుండా ఉన్నారని ఆమె మండిపడ్డారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. పదునైన పంచ్ లతో భలే విరుచుకుపడ్డారు. కానీ, తర్వాత ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి అభిమాన తాకిడి ఎక్కువ నటుడిపై అనవసర విమర్శలు చెయ్యటం ద్వారా రోజాకు ఒరిగిందేంటి? ఇప్పుడామెపై అంత ఎంత ఆగ్రహాంతో ఉంది పవన్ అభిమానులు. ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారంటూ నగరి ఎమ్మెల్యేపై గుస్సా అయిపోతున్నరు. రోజా అంతలా రెచ్చిపోకు అని వార్నింగ్ ఇస్తున్నారు.  దీనికి పవనే స్పందించాల్సిన అవసరం లేదు మేం చాలంటున్నారు. జర జాగ్రత్త రోజాగారు నజర్ మీ మీద పడితే మీ పరిస్థితి అంతే ఇక.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ