ప్రభుత్వంపై పోరుకు సై అన్న పవన్

April 10, 2015 | 02:57 PM | 124 Views
ప్రింట్ కామెంట్
pawan_ready_for_fight_against_TDP_govt_niharonline

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు మద్దతుగా నిలిచిన జనసేన అధినేత, టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి రంగంలోకి దిగారు. రాజధాని కోసం భూములివ్వని రైతులపై భూసేకరణ చట్టాన్ని వినియోగించేందుకు ఏపీ సర్కార్ యత్నిస్తే, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించారు. ‘‘ఈ రోజు మీడియా వార్తల ప్రకారం ఏపీ ప్రభుత్వం, రాజధాని కోసం భూములు ఇవ్వని రైతుల మీద భూసేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ఆ ఉద్దేశంతో ముందుకెళితే మటుకు నేను రైతులకు అండగా పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన కాసేపటి క్రితం ట్విట్టర్లో పేర్కొన్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ