వ్యాపమ్ వరుస మరణాలపై సుప్రీం స్పందించింది

July 07, 2015 | 12:55 PM | 5 Views
ప్రింట్ కామెంట్
supreme_court_of_india_vyapam_scam_niharonline

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వ్యాపమ్ కుంభకోణం కేసు మృత్యుపాశంగా మారుతోంది. ఇప్పటి దాకా 49 అనుమానాస్పద మరణాలు నమోదయ్యాయి. దీంతో ఈ అంశంపై మంగళవారం సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కుంభకోణానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 9 విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం తెలిపింది. సంచలనం సృష్టిస్తున్న ఈ వరుస మరణాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణ నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని పలువురు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తోపాటు ఆప్ నేత కుమార్ విశ్వాస్ కూడా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. దీంతో మొత్తం 9 పిటిషన్లపై ఖచ్చితంగా విచారణ జరుపుతామని బెంచ్ మంగళవారం తెలిపింది. కాగా, తాజాగా, ఈ కేసులో విచారణ నిర్వహించిన కానిస్టేబుల్ రమాకాంత్ పాండే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మంగళవారం ఉదయం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి గత మూడు రోజుల్లో ఇది నాలుగో మరణం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ