ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పై రాజకీయ రగడ జరుగుతున్న నేపథ్యంలో నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఏపీ కి ప్రత్యేక హోదాపై బీజేపీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్ఫష్టత ఇవ్వకపోవటంపై ఆయన తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మద్ధతిచ్చిన, నమ్మినవారి ఆశయాలకు ఆ పార్టీ దూరంగా ఉండదని తాను ఆశిస్తున్నాన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన కోరాడు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఏడాది క్రితం విభజన బిల్లు పార్లమెంటులో అస్తవ్యస్థ పద్ధతిలో ఆమోదం పొందిన విషయాన్ని పవన్ గుర్తుచేసుకున్నాడు.