పీతల సరదా గన్ మెన్ ప్రాణం మీదకొచ్చింది

December 03, 2015 | 11:12 AM | 2 Views
ప్రింట్ కామెంట్
peethala_sujatha_bike_ride_troubles_her_gun_men_niharonline

బైక్ నడపాలన్న ఆ మంత్రిగారి సరదా వెంట ఉండే గన్ మెన్ల ప్రాణం మీదకొచ్చింది. వివరాళ్లోకి వెళితే... ఏపీ లో తెలుగుదేశం తరపున జనచైతన్య యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ సంద్భంగా మహిళా మంత్రి పీతల సుజాత బుధవారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదర్శంగా తీసుకుందేమో ఆమె కూడా పసుపు రంగులో ఉన్న స్కూటర్ ఎక్కారు. వెంట ఇద్దరు గన్ మెన్లు, జంగారెడ్డిగూడెం ఎస్సై మంత్రిగారి స్కూటర్ వెంట పరుగులు పెట్టారు.

                          వంద మీటర్లో, రెండు వందల మీటర్లో అయితే ఫరవా లేదు కానీ, మంత్రి సుజాత ఏకంగా ఐదు కిలో మీటర్ల మేర స్కూటర్ పైనే వెళ్లారు. అంతదూరం ఆ ఇద్దరు గన్ మెన్లు, ఎస్సై మంత్రి గారి స్కూటర్ వెంటనే పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇంకొద్ది దూరం వెళితే మంత్రిగారి స్కూటర్ రైడింగ్ ముగుస్తుందనగా, ఆమె గన్ మన్ గంగాధర్ ఆయాసంతో తూలి కిందపడిపోయారు. అయితే మంత్రిగారి వెనుక వస్తున్న పార్టీ నేతలు తమ బైకులకు సడన్ బ్రేకులు వేయడంతో గంగాధర్ కు గాయాలేమీ కాలేదు. ఆ తర్వాత కింద నుంచి లేచిన గంగాధర్ కొద్దిసేపు కూర్చుండి మళ్లీ మంత్రిగారి స్కూటర్ వెంట పరుగు పెట్టారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ