కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలిపేద్దాం అన్నమాటకు కట్టుబడి మనసావాచా కర్మణా ఆచరించి చూపించిన ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి. రాజకీయ చదరంగపు నీతిననుసరించి కాంగ్రెసు తీర్థప్రసాదాలు స్వీకరించిన సమయస్ఫూర్తి గల విదుషీమణి. జెమాలజీ శాస్త్రం పట్ల ఆసక్తికలది. కుటుంబ వైషమ్యాల ప్రభావంతో చంద్రబాబుని అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూ మాతృసమానురాలైన లక్ష్మీ పార్వతి అడుగుజాడల్లో నడుస్తుంది.
ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంటుగా ఉంటూ తన తోబుట్టువు భువనేశ్వరి భర్త పార్టీని గద్దె దింపి 2019లో ఆంధ్రలో అధికారంలోకి బీజేపీని తేవటం తన ధ్యేయ మంటున్నది. అందుకే కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నామని ప్రకటించింది. హోదా సంగతి అటుంచి తత్సమానమైన రాయితీలు ఆంధ్రకు దక్కగలవని అంటుంది. కేంద్రం యొక్క తత్వం బోధపడేలా మాట్లాడుతన్నట్టు ఈమె చతురత వెల్లడిస్తుందని అనుకోవచ్చా? దోషం కనిపిస్తే మిత్రపక్షమైనా సరే ఖబడ్దార్ అనికూడ కనుబొమ్మలు ఎగరవేస్తుందీవిడ!