పీసీసీ చీఫ్ కి ఘోర అవమానం

October 05, 2015 | 05:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
PCC-chief-raghuveera-in-kuppam-niharonline

పార్టీ పరిస్థితే అంతంత మాత్రం అనుకుంటున్న టైంలో పీసీసీ చీఫ్ కి ఘోర అవమానం జరిగింది. అది కూడా సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే కావటం విశేషం. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు చెప్పులు, రాళ్లు విసిరారు. కుప్పంలో విమానాశ్రయం ప్రతిపాదిత స్థలంలో రఘువీరా ఈరోజు పర్యటించారు. విమానాశ్రయం నిర్మాణంపై స్థానికుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుండటంతో ఆయన వారిని కలిశారు.

రఘువీరా అక్కడికి రావడాన్ని టీడీపీ కార్యకర్తలు నిరసిస్తూ ఈ చర్యలకు పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక ఎస్ఐ కు గాయాలయ్యాయి. అయితే, కుప్పంలో సభ నిర్వహించాలనుకున్న కాంగ్రెస్ నాయకులకు పోలీసులు అభ్యంతరం తెలిపారు. సభకు హాజరయ్యేందుకు వెళుతున్న సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ