కేసీఆర్ సంతకంతో బాబు ఫేట్ మారేనా?

May 14, 2016 | 01:53 PM | 2 Views
ప్రింట్ కామెంట్
raghuveera-reddy-chandra-babu-kcr-niharonline

ఉనికి కోల్పోయి తిరిగి కోలుకుంటుందో లేదో తెలీని పార్టీని పునాదుల నుంచి మళ్లీ లేపాలని ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షం చేయలేని పని చేయాలంటూ తనకు మించిన భారాన్ని నెత్తిన వేసుకుంటున్నారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో విఫలం కావటంతో ఆ బాధ్యతను తీసుకుంటోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా అన్ని పార్టీలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించింది. అంతేకాదు తెలంగాణ చేపడతున్న ప్రాజెక్టుల వల్ల ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని, వెంటనే వాటిని అడ్డుకునేందుకు పోరాటం చేపడతామని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి  చెబుతున్నారు.

వైజాగ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కుమ్మకయి దొచుకుంటున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం చేస్తే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడే, తెలంగాణ ప్రాజెక్టులకు బాబు అడ్డు చెప్పడం లేదని దుయ్యబట్టారు. బాబు అసమర్థతను అలుసుగా తీసుకుని తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. వెంటనే వాటిని అడ్డుకోకపోతే ప్రజలు తిరగబడి చంద్రబాబును తరిమి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ