కమిట్ మెంట్! సుప్రీం వద్దన్నా చేసి తీరుతాడట

May 08, 2015 | 12:51 PM | 42 Views
ప్రింట్ కామెంట్
Rahul_Gandhi_attending_trial_court_even_sc_says_no_need_niharonline

రాహుల్ గాంధీ రీ ఎంట్రీ ఆయనలో వ్యక్తిగతంగా మార్పు తెచ్చిందా? తిరిగొచ్చాక ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులంతా జల్లెడ పడుతున్నారు. ఎందుకంటే వచ్చి రాగానే ఆయన చేస్తున్న పొలిటికల్ ఫీట్లు మాములుగా లేవు. తాజాగా ఓ పరువు నష్టం కేసులో రాహుల్ ఇప్పట్లో హాజరుకావాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయనగారు భారతీయ న్యాయ వ్యవస్థ విలువను మరింతగా పెంచాలని భావిస్తున్నాడట. అందుకే సుప్రీంకోర్టు వద్దన్నా సరే రాహుల్ కోర్టుకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారట. తన కార్యాలయం పేరిట ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించిన రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ కేసులో తాను శుక్రవారం మహారాష్ట్రలోని భీవండి ట్రయల్ కోర్టుకు హాజరుకానున్నారట. స్థానిక పోలీసులేమో ఆయన వచ్చే విషయాన్ని మాత్రం ఇంత వరకు దృవీకరించలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ