ఇంటర్ నెట్ లో నెట్ న్యూట్రాలిటీ పై లోక్ సభలో బుధవారం తీవ్ర దుమారం చెలరేగింది. వాడి వేడి చర్చ జరగగా అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నంగా ప్రతిపక్ష తీవ్రంగా ప్రయత్నింస్తోంది. ఈ సందర్భంగా సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఇంటర్నెట్ ను కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే నెట్ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చించాల్సిందిగా రాహుల్ ఈ సందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. అనంతరం టెలికంశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనికి సమాధానం ఇస్తూ నెట్ న్యూట్రాలిటీకి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. యూపీఏ సర్కార్ లా తాము ఏ కార్పొరేట్లకు తలవంచలేదని, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా పక్షపాతరహితంగా అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలన్న 'నెట్ న్యూ ట్రాలిటీ' అంశంపై వివాదం రేగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అంతేకాదు దీనిపై అధ్యయనం కోసం నిపుణులతో కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అసలు సమస్యేంటంటే... ఇంటర్నెట్ సర్వీసులు అందించే విషయంలో తటస్థంగా ఉండాల్సిన టెల్కోలు కొన్ని యాప్ లను ఉచితంగా అందించడమే. ప్రోడక్ట్ డెవలపర్లు కొంత మొత్తం చెల్లిస్తే చాలు వారి యాప్ లను యూజర్లు ఉచితంగా వినియోగించుకునే విధంగా ప్రత్యేక పథకాలు అందిస్తున్నారు. తద్వారా వారు లాభపడటంతోపాటు సైట్లకు, యాప్ లకు విపరీతంగా ప్రచారం జరుగుతోది. అయితే, నెట్ విషయంలో తటస్థంగా ఉండాల్సిన టెల్కోలు ఈ విధంగా చేయడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందని టెలికాం సంస్థలు ట్రాయ్ ముందు మొరపెట్టుకుంటున్నాయి.