కరడుగట్టిన కశ్మీర్ ప్రత్యేక వేర్పాటువాది మసరత్ ఆలం భట్ విడుదలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తమతో సంప్రదించకుండానే జమ్ము ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ విపక్షాలు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అటు జమ్ము ప్రభుత్వంతోపాటు ఇటు కేంద్రంపై కూడా వారు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక గురువారం పార్లమెంటులో కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ... తక్షణమే జమ్ము ప్రభుత్వం కోర్టులో మసరత్ బెయిల్ పై సవాల్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు, ఆలం అతని సహచరులపైనా నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ సలహా ఇచ్చింది. ఆలంపై ఉన్న మొత్తం 27 కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని, ఆ కేసుల్లో బెయిల్ ఇవ్వటంపై ఖచ్ఛితంగా సవాల్ చేయాలని రాజ్ నాథ్ సింగ్ జమ్ము ప్రభుత్వానికి సూచించారు.