కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఆస్ప త్రిలో చేరారు. 63 ఏళ్ళ రాజ్ నాథ్ సింగ్ సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే ఆస్ప త్రిలో చేరినట్టు తెలిసింది. ఆయన మెదంటా ఆస్ప త్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ రోజు ఉదయం ఆయన పరీక్షల నిమిత్తం వెళ్ళి ఆ తరువాత డిస్ చార్జ్ చేయబడ్డారు. వారంతంలో పని వత్తిడి తక్కువగా ఉండడం వల్ల సమయం చిక్కడంతో జనరల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్ళారు. నాలుగు గంటల పాటు పరీక్షలు నిర్వహించి ఆతరువాత ఆయన్ను ఇంటికి పంపారు. ఆయన ఇంతకుముందు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు హోంమినిష్టర్ పదవిని కట్టబెట్టింది. అయితే ఈ వార్తను కొంతమంది వార్తా ప్రతినిధులు ఆయనకు గుండెనొప్పి వచ్చినట్టుగా, హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించినట్టు కథనాలు రాస్తుండడం విశేషం.