తిట్టిన నోటితోనే తెగ పోగడ్తలా! ఎందుకో?

February 12, 2015 | 05:57 PM | 26 Views
ప్రింట్ కామెంట్
reason_behind_kcr_praises_modi_niharonline

సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ పై ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఎంతగా ప్రభావం చూపిందంటే... కొన్ని రోజులపాటు కేసీఆర్ కి ప్రధాని అపాయింట్ మెంట్ దొరకనంతగా, కేంద్రంతో సంబంధాలు దెబ్బతినేంతగా . అయితే తాజాగా డిల్లీ పర్యటన నుంచి కేసీఆర్ స్వరం మారినట్లు తెలుస్తోంది. మోదీని మచ్చిక చేసే పనిలో ఆయన తెగ బిజీగా ఉన్నట్లు అనిపిస్తోంది. అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశం అయిన కేసీఆర్ మాట్లాడుతూ... మోదీ ప్రధానిగా ఉండటం మనకు కలిసే వచ్చే అంశం అని అన్నారట. తెలంగాణ బిల్లు సమయంలో పార్లమెంటులో బాగా సహకరించినప్పటికీ బీజేపీ పైనే మొదటి నుంచే కేసీఆర్ విమర్శనాస్ర్రాలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇది మరింత రేంజ్ కి పోయి ఏకంగా మోదీ నే విమర్శించే స్థాయికి వెళ్లింది. అయితే తాజా పరిణామాలను విశ్లేషిస్తే బీజేపీ తో తిరిగి దోస్తీ కట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేంద్రంతో అంతగా సంబంధాలు లేకపోయినప్పటికీ పరస్పర సహకారంతోనే రాష్ట్రాభివ్రుద్ధి సాధ్యమవుతుందన్న ఆలోచనలో ఉన్న ఆయన కేంద్రానికి స్నేహహస్తం అందించేందుకు రెడీగా ఉన్నారట. బోనస్ గా మంత్రిత్వ శాఖలు కూడా లభించే అవకాశం కూడా ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాదు టీడీపీతో దోస్తీ తెంచుకుంటున్న బీజేపీ కి క్రమంగా దగ్గరవ్వటం కూడా మంచిదేనని గులాబీ బాస్ భావిస్తున్నాడట. అందుకే తిట్లు తిట్టిన ఆ నోటితోనే ఇప్పుడు తెగ పోగుడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ