తెలంగాణ వైసీపీ రేటు 1500 కోట్లేనా!

May 02, 2016 | 02:46 PM | 4 Views
ప్రింట్ కామెంట్
revanth-reddy-on-ponguleti-join-in-TRS-niharonline

ఓవైపు ఏపీలో అధికార పక్షంలోకి వైసీపీ వలసలు కొనసాగుతుంటే, మరోవైపు తెలంగాణలో కూడా ఆ పార్టీ మూత పడే స్థితికి చేరింది. ప్రస్తుత తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లోకి చేరిపోవడం ఖాయమైపోయింది. ఈ నెల 4న టీఆర్ఎస్ లో చేరుతున్నానని స్వయంగా పొంగులేటి ప్రకటించారు. సోమవారం ఉదయం కేసీఆర్ తో సమావేశమైన పొంగులేటి బయటికి వచ్చాక తనతోపాటు ఎవరొచ్చినా టీఆర్ఎస్ లోకి తీసుకెళ్తానని చెప్పాడు కూడా. దీంతో వైసీపీ దుకాణం బంద్ కావటం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే టీఆర్ఎస్ లోకి పొంగులేటి చేరిక, టీఆర్ఎస్ లో వైసీపీ తెలంగాణ శాఖ విలీనంపై టీడీపీ ఫైర్ బ్రాండ్, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో పొంగులేటి చేరికకు కారణాంటూ ఆరోపణలు గుప్పించారు. రూ.1,500 కోట్ల విలువైన పనులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పొంగులేటికి ఆఫర్ చేశారని రేవంత్ ఆరోపించారు. ఇంతమేర డబ్బు ఎర వేస్తే పొంగులేటి ఒక్కడే ఏంటీ ఏకంగా పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేయక ఏం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తోందని ఊరూరా తిరిగి ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీ నేతల ఫిరాయింపులపై ఎందుకు మాట్లాడటం లేదంటూ రేవంత్ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ