ఏ కులము నీదంటే- తుపాకులము నవ్విందీ!

August 05, 2015 | 03:53 PM | 4 Views
ప్రింట్ కామెంట్
revanth_reddy_letter_to_kcr_prisons_release_niharonline

మన భారతదేశం గొప్పది. మేరా భారత్ మహాన్! మనువు అనే మహానుభావుడు చాతుర్వర్ణ వ్యవస్థను ఆద్యుడని అందువలనే ఎవరు మీరు, ఏ ఉట్లు మీరు, ఏ వర్ణం, ఏం కేస్టు, మీ ఇంటిపేరు, ఏమి లాంటి ప్రశ్నలు సంఘంలో ఆహ్లాదకంరగా కర్ణపుటాలని సోకుతుంటాయి. దీన్లో మళ్లీ ఉపకులాలు, శాఖోపశాఖలు వగైరా, చంద్రబాబుగారి ఇంగ్లీష్ ప్రకారం వాటయామ్ సేయింగ్. ఈ కారణాల వల్ల కేస్టు ఫీలింగ్ అనేది అవతరించింది. కాపుల్ని కాపులు, రెడ్డిల్ని, కమ్మవారిని, రాజుల్ని, వైశ్యుల్ని, బ్రాహ్మాల్ని, వారివారి కులపోళ్లు వాటేసుకుని మనోడేరావాడు అని ధీర్ఘాలు పోతారని నమ్ముదాం. ఫర్ సపోజ్, మాటవరసకి ఎవరికి తాలూకు వాళ్లని ప్రేమించుకుంటే తప్పా? అది లోకరీతి కాదా మరి?

 

                                                     ఈ ఆవేదన అంతా ఎందుకంటే... చిరంజీవి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నాయకుడిగా ప్రకాశిస్తూ ఓటుకి నోటు కేసులో కొంచెం మసకబారడం జరిగింది. పరిస్థితులు వికటించి చెర్లపల్లిలో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఆ గోల్డెన్ పీరియడ్ లో అక్కడి ఖైదీలతో అవినాభావ సంబంధం ఏర్పడింది. అందులో ఒక సీనియర్ ఖైదీ తన కేసుపై విశ్లేషణ కూడ మనసుకి హత్తుకుందట. ఖైదీలతో అంత మమేకమై, మమత, మమకారాలు పంచుకుని బెయిలు దొరికినా కొంచెం దిగులుచెంది ఇంటికొచ్చేడు.

ఈ నెల స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తనలాంటి సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదీలను విడుదల చేయవల్సిందిగా కేసీఆర్ కు రేవంతు ఉత్తరం వ్రాసేడు. గతంలో లేని విధంగా రెడ్డిగారు ఈ ఉత్తరం రాయడం వల్ల ఈ వ్యాసం వ్రాయాల్సి వచ్చింది. అర్థం చేస్కోగలరు. సాటి ఖైదీల యోగక్షేమాలు పట్టించుకోవడమే నేరమౌనా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ