అదను కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలతో తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించడంలో టీడీడీపీ నేత రేవంత్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు మరోసారి పేల్చారు. రైతుల రుణమాఫీ ని ఆధారంగా చేసుకుని ఈసారి ఆయన అందుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన కూతురు కవితను పొగడటం కాస్త విడ్డూరం.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును అతని కుమార్తె కవిత చెబుతుందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ లో ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఎవరైనా ఆడ బిడ్డ ఇంటి బయటకు వచ్చి జోలె పడుతోందంటే, దాని అర్థం ఆమె తండ్రి చేతకాని వాడు, తాగుబోతు, తిరుగుబోతు, కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకోని వాడు అని అర్థమని అన్నారు. ఎంపీ కవిత రైతుల కోసం జోలె పట్టుకుని రోడ్డు మీదికెక్కింది అంటే దాని అర్థం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. తన కుమార్తెను చూసైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.రెగ్యూలర్ గా కేసీఆఱ్ ను విమర్శించటం కామనే అయినా ఈసారి ఆయన కూతురు కవితను పొగటం కాస్త విశేషమే అని చెప్పుకొవాలి మరీ.