తెలంగాణ ముఖ్యమంత్రి చేతిలోనే మున్సిపల్ శాఖ కూడా విశ్రమిస్తోంది. తమ జీతాలు పెంచాల్సిందిగా చేసిన అభ్యర్థన సఫలం కానందున మున్సిపల్ కార్మికులు సమ్మెరాగం ఆలపిస్తున్నారు. ఆరాగ మాధుర్యం అలావారు అస్వాధించటంలో నిమగ్నమయి ఉన్నందున భాగ్యనగరంలో గల్లీ గల్లీ చెత్తా చెదారంతో శోభించి గుభాళించనారంభించేయి. ఇదంతా మున్సిపల్ కార్మికులు తమ కుటుంబీకుల నిమిత్తం సద్వినియోగించగా సృష్టించబడ్డ వ్యర్థాలు కాదు. గౌరవనీయ సభ్యసమాజం వారి ప్రయోజకత్వమే ఈ అత్తరు పరిమళాలు. ఒక ప్రక్క హైదరాబాదును వరల్డ్ కాస్ వండర్ వరల్డ్ గా తీర్చిదిద్దబోతున్నామని కలల బేహారులు చెప్పడం మానరు. యధార్థమేమో కళ్లకి కట్టినట్టు కనబడటం మానదు. వానలు లేవు లేవు అని మనం హైరానపడుతున్నాంగానీ, ఈ టైంలో కురిస్తే ఏమౌతుందో ఊహించండి. రోడ్లపై నున్న చెత్త, పై నుంచి దిగి వచ్చిన వాన దేవుడితో వియ్యమంది పండగ చేసుకుని చిందు వేస్తే హాస్పిటళ్లు కిటకిట లాడుతూ జనాభా నియంత్రణకు దోహదపడగలదు. ఈ సమస్యల పరిష్కారం జరక్కపోతే పదవి ఊడిన సారయ్య, తదితర ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామంటున్నారేగానీ, లాఠీలు, తుపాకీలు పక్కనబెట్టి చెత్తరాక్షసిని ఎన్ కౌంటర్ చేస్తున్న పోలీసులను చూసి సిగ్గుపడే ప్రయత్నం చేయుదురుగాక!