వరుసబెట్టి ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు ఏం చర్యలు తీసుకోవటం లేదు. అంతేకాదు ఆశ్చర్యకర రీతిలో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే ఇద్దరు కాలేజీ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ లో రితేశ్వరి కేసును సీరియస్ గా తీసుకుని ఉంటే ఇప్పుడు మరో అమ్మాయి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనంతటికి చంద్రబాబే కారణమా?
ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. అయ్యో ఇదంతా నేను అంటోంది కాదు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా పై ఆరోపణలన్నీ చేశారు. విజయవాడ లోని స్టెల్లా కళాశాలలో భానుప్రీతి అనే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై రోజా మీడియా సమావేశం పెట్టి మరీ మండిపడ్డారు. రితేశ్వరి ఘటన సందర్భంగా కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ మరో అమ్మాయి ఆత్మహత్యకు చేసుకునేదా? అని రోజా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టే వారి విలువ ఏమిటో ఆయనకు తెలియడంలేదని ఆమె అన్నారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నా, ఆడపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇవేమీ పట్టించుకోకుండా సింగపూర్, మలేషియా అంటూ విదేశాలలో సీఎం విలాసాలు చేస్తున్నారని రోజా ధ్వజమెత్తారు.
ప్రతీ దాన్ని సాకుగా చేసుకుని విమర్శలు చేద్దామనుకుంటున్నా రోజాకి ఈ అంశంలో మాత్రం కాస్త వ్యతిరేకత వినిపిస్తోంది. విదేశీ పర్యటనలు, ఆత్మహత్యలకు సంబంధం లేకున్నా, భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఏపీ ప్రభుత్వం పై ఇప్పుడు రోజా చేస్తున్న ఆరోపణలు ఆమె అజ్నానానికి నిదర్శనమనే అనుకోవాలే తప్ప మరేంలేదు.