జగన్ జైలు గుట్టు విప్పిన రోజా

October 08, 2015 | 04:11 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ysrcp-mla-roja-about-jagan-jail-punishment-niharonline

ఓవైపు నూతన రాజధాని శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామన్న ఉద్ధేశంతో దీక్ష చేపట్టాడు జగన్. ప్రత్యేకంపై చంద్రబాబు సహా ఏ ఒక్కరూ స్పందించటం లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ప్రజలు మోసపోతున్నారని చెప్పేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు వైకపా అధినేత. ఇందులో భాగంగా నల్లపాడులో దీక్ష చేపట్టాడు. ఇక ఈ దీక్షా వేదికగా ప్రతిపక్షనేతలంతా ఒక్కొక్కరుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో చంద్రబాబు చేయికలిపి, జగన్ ను జైలుకు పంపారని ఆరోపించారు. ఎక్కడ ఆ రెండు పార్టీల బండారం బయటపెడతారో అని కుట్రపన్నారని విమర్శించారు. బయటికి వచ్చాక కూడా ఊపిరిసలపని పరిస్థితి సృష్టించారని, అధికారంలోకి రావటానికి మానసికంగా జగన్ ని దెబ్బతీశారని ఆమె అన్నారు. రాష్ట్ర విభజన కూడా చంద్రబాబు కుట్రే అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 40 ఏళ్ల వయసున్న జగన్ ను చూసి వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షను చూసి టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. ఎలాగైనా జగన్ దీక్షను ఆపాలని చంద్రబాబు యత్నిస్తున్నారని... దీక్షను ఆపడం ఆయన తరం కాదని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే వరకు టీడీపీ నేతలను గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వరాదంటూ ప్రజలకు పిలుపునిచ్చారీ ఫైర్ బ్రాండ్. సంబంధంలేని ఆరోపణలు చెయ్యటంలో ఎంతైనా రోజాకు రోజానే సాటి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ