అంతా అయ్యాక ఆకులతో పనేముంది?

October 08, 2015 | 02:40 PM | 1 Views
ప్రింట్ కామెంట్
undavalli-arun-kumar-book-on-AP-reorganisation-act-to-president-niharonline

తెలుగు రాష్ట్రాల విభజన చరిత్రలో ఓ దుర్దినమని ఆంధ్రప్రదేశ్ నేతలంతా ఆనాడు మొత్తుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సాక్షిగా గోలతో, అల్లర్లతో రణరంగాన్ని తలపిస్తూ గేట్లు మూసివేసి, ఎంపీలను బంధించి మరీ విడగొట్టారని వారంతా ఆక్రోషించారు. పరిస్థితుల దృష్ట్యా లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా కాంగ్రెస్ సైతం అప్పుడు విభజనకు ఆమోదం తెలిపింది. అయితే నాటి నుంచి విభజన ఓ పద్ధతి ప్రకారం జరగలేదని వాదిస్తున్న వస్తున్న ఏపీ నేతల్లో ముఖ్యుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఏ విషయానైనా లెక్కలతో సహా సూటిగా చెప్పగలిగే వ్యక్తిత్వం ఆయనది. కానీ, విభజన జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా... ఇప్పటికీ ఆయన ఆవేశం ఏ మాత్రం తగ్గలేదు.

 ఇప్పుడు మళ్లీ విభజన అంశాన్ని లేవనెత్తి తెర మీదకు వస్తున్నారు. ‘ఏపీ పునర్వ్యవ్యస్థీకణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందా?’ పేరిట ఆయన ఓ పుసక్తం రాశారు. అంతేకాదు పుస్తకం ప్రతిని కాసేపటి క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్వవస్థీకరణ బిల్లుపై మరోమారు పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని తాను రాష్ట్రపతికి విన్నవించానని కూడా ఆయన చెప్పారు. పుస్తకంలో రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న చర్యలు, బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై పూర్తి వివరాలను పొందుపరిచానని ఉండవల్లి పేర్కొన్నారు. అయినా అంతా అయిపోయాక ఇలా కాగితాలు రాయటం, ఇవ్వటంతో ఒరిగేదేం లేదు, పెన్నులు, ఇంక్ అయిపోవటం తప్ప. ఉండవల్లి విమర్శలు అరణ్య రోదనే తప్పా... పెద్ద ప్రయోజనం ఏం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ