బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బెయిల్ విషయంపై ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంటోంది. వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ, ఈసారి సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేశారు. ముస్లిం అవటం వల్లే ఆయనకు హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ వచ్చిందని ఆరోపించారు. సల్మాన్ ముస్లిం కాకుంటే నిరుపేద బాధితులకు న్యాయం జరిగి ఉండేదని ఆమె పేర్కొన్నారు. కానీ, ఇక్కడో విషయం ఆమెకు గుర్తు రావటం లేదేమో! ఆ ఖాన్ సార్ గారు స్వయానా మన ప్రధాని గారికి చాలా దగ్గర అనే విషయం. ఈ అంశంపై ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయనుకొండి మరప్పుడు ఏం సమాధానం చెబుతారు, సీను రివర్స్ అయిపొద్ది సాధ్వీ గారూ.