త్వరలో తెలంగాణ శాసన మండలికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క సీటు గెలుచుకునే అవకాశం ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే అంశమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న ఒక్క సీటుకు సుమారు 40 మంది కాంగ్రెస్ పెద్దలు పోటీ పడుతున్నారు. ఉన్న ఒక్క సీటు కోసం సుమారు 40 మంది కాంగ్రెస్ పెద్దలు పోటీ పడుతున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 21 మంది ఎమ్మెల్యేలు గెలువగా, వారిలో నలుగురు టీఆర్ఎస్ లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్ సభ్యుడు దొంతిరెడ్డి కాంగ్రెస్ లో చేరటంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరింది. తెలుగుదేశం, బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ కు రెండు సీట్లు ఎక్కువగా ఉండటంతో వామపక్షాల సహకారంతో ఒక సీటు సులువుగా గెలవచ్చన్నది కాంగ్రెస్ అభిప్రాయం. ఆ ఒక్క సీటూ ఎవరికి దక్కేనో??