సింగ్ సాబ్ విధానాలనే భాయ్ కొనసాగిస్తున్నాడట

May 26, 2015 | 05:55 PM | 9 Views
ప్రింట్ కామెంట్
Sitaram_Yechury_on_modi_one_year_rule_niharonline

ఏడాది బీజేపీ పాలనపై విపక్షాలు విరుచుకుపడటం మాములే. కానీ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కాస్త స్పెషల్ గా స్పందించారు. మతోన్మాద రాజకీయాలను మోదీ సర్కార్ ప్రోత్సహిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్థిక విధానాలు కూడా సరిగ్గా లేవని దుయ్యబట్టారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కొనసాగించిన ఆర్థిక విధానాలనే మోదీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నారు. సంపన్నుల కొమ్ము కాస్తోందని, పేదవాళ్లు మరింత దిగజారుతుంటే, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని చెప్పారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ