అత్యాచారాలపై అథారిటీ

August 20, 2015 | 04:00 PM | 4 Views
ప్రింట్ కామెంట్
mulayam_singh_yadav_comments_on_rape_niharonline

ములాయం సింగు యాదవ్. ఒకానొక భరతమాత నసీబ్ మంచిగలేని ఘడియల్లో ప్రధాన మంత్రి పదవికై అర్రులు చాచిన ఆశాజీవి. రేపు అంటే మానభంగం, అత్యాచారం వంటి సున్నితమైన అంశాలపై బహుమొరటుగా స్పందించే సహృదయుడు. గతంలో ఒక దారుణమైన లైంగిక దాడికి సంబంధించి మరణశిక్ష అమలు విషయం ఈ ములాయం మూర్ఖుడు లోక విరుద్ధంగా సూక్తులు వల్లించేడు.

                    ‘‘కుర్రాళ్లన్నాక అలాగే ఉంటారు మరి, రేపు చేసినంత మాత్రాన ఏకంగా ఉరిశిక్ష వేసేయడమంటే చాలా అన్యాయం కదూ అని గుండెలు బాదుకున్నాడీ జెంటిల్ మెన్. అసలు ఇంత జనాభా ఉన్నప్పుడు రేప్ లు కామన్. ఇంకా మాట్లాడితే జనాభా నిష్పత్తిలో రేపులు జరగాలని ఆశిస్తున్నాడట ఈ పెద్ద మనిషి. అదే  ధోరణి పొడిగిస్తూ నలుగురు కలిసి సామూహికంగా రేప్ చేశారంటే నవ్విపొదురుగాక, అయినా అలా ఎలా వీలవుద్ది. నాకర్థం కాదు. హైలీ ఇంపాజిబుల్’’ అని దేని మీదనో గుద్ది మరీ చెప్పేడు. పోగాలం దాపురించినప్పుడు బుద్ధి పెడదారి పట్టడం అంటే ఇదే మరి.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ