సుజనాకి జనం అంటే లోకువేం?

November 06, 2015 | 04:10 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sujana_chowdary_satires_on_AP_special_status_again_niharonline

చంద్రబాబుకి నీడలా వెన్నంటి ఉండే సుజనాచౌదరి ఈమధ్య కాలంలో యావన్మందికీ బాగానే ముఖపరిచయం అయ్యేడని భావించవచ్చు. ఎవరీ పెద్ద మనిషి? సుజనా గ్రూపు అధినేత మరియు గౌరవ పార్లమెంట్ మెంబరు. అదేదో శాస్త్రీయ శాఖకు ఉపమంత్రి. బ్యాంకు లావాదేవీల్లో నిలాపనిందల బరువు మోస్తున్న బాహుబలి. ఇవన్నీ కాదుగానీ ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్షతగాత్రులకు తహతహ. ఇల్లూ వాకిలీ, కొంపగోడూ లేక విలవిల్లాడుతున్న వారిపై వారానికో పదిరోజులకొకసారి ప్రత్యేక హోదా పేరుతో సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలకడగా ఉంటున్నాడు. కేంద్రం చంకలో ఉంటున్నాడు కదా అని ఆంధ్ర వెర్రిముఖాలు ఇతగాడి ప్రకటనలు శ్రద్ధగా విన్నట్లు పోజు పెడుతున్నారు.

నిన్నటికి మొన్న ప్రత్యేక హోదా రావడం ఆవశ్యం, ఎవడికోసం వస్తుందని గాండ్రించేడు. అప్పుడెప్పుడో ప్యాకేజీ తాయిలం సర్వమంగళం అని సన్నాయి నొక్కులు నొక్కేడు. ఈ రోజు మళ్లీ ప్ర్యతేక హోదా అంటే చాక్లెట్టూ, బిస్కెట్టు అనుకుంటున్నారా అని మ్యావ్ మ్యావ్ అంటూ మిమిక్రీ చేశాడు ఈ స్థిరం మాలినోడు. ఈ విధంగా ప్రజలతో సరసమాడి కితకితలు పెడితే, పెద్దవారు చక్కిలిగిలిపెట్టేరు నవ్వకపోతే బావుండదు అని మూకుమ్మడిగా చిరునవ్వుతో ఆరంభించి, విశాలంగా నవ్వి, దాన్ని వికటాట్టహాసంగా మార్చి ఫెళ్లున నవ్వితే ఆ తాకిడికి కొట్టుకుపోగలవు బ్రదర్! ప్యాకేజీయా, ప్రత్యేక హోదాయా మోదీ బాబాయ్ ని నిలదీయవయ్యా చౌదరిగారూ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ