సామాన్య ప్రభుత్వానికి దెబ్బల మీద దెబ్బలు...

May 29, 2015 | 01:35 PM | 2 Views
ప్రింట్ కామెంట్
arvind_kejriwal_notice_supreme_court_niharonline

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారణకు చేపట్టిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ పై పరిశీలించిన సుప్రీం, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. మధ్యంతరం ఉత్తర్వులు జారీచేసిన న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వానికి నోటీస్ జారీచేసింది. మూడు వారాల్లో నోటీసుకు స్పందించాలని గడువు విధించింది. మరోవైపు కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ ను పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. ఇప్పటికే వరుస సమస్యలతో సతమతమవుతున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి గత కొద్ది కాలంగా పాలన పరమైన చిక్కులు తలెత్తుతున్నాయి. కాగా, ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఆప్ ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో మరిన్ని చిక్కులు తప్పేలా కనిపించటం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ