లలిత్ మోదీ కి అక్రమ మార్గంలో సాయపడ్డానని విపక్షాలు కోడై కూస్తున్నాయని వీరికి మానవత్వం లేదని సుష్మాస్వరాజ్ సెంటి మెంటల్ గా విలవిల లాడుతున్నారు. వీరందరి కూతల కంటె కుక్కుటేశ్వరి స్థాయిలో కూస్తున్న సోనియా విషయంలోనే సుష్మ భగ్గుమంటోంది. మోదీ భార్యకి కాన్సర్. ఇలాంటి పరిస్థితుల్లో నీ చావు చావంటూ రోగిని సోనియా అయితే వదిలేసే వారా? అని తర్కబద్ధంగా నిలదీసింది. తన గ్రహస్థితి సవ్యంగా లేనందునే స్నేహితులు ఇలాంటి అఘాయిత్యపు మాటలు అంటున్నారని ఫీలయిపోయారు.
సోనియా అయితే ఏం చేస్తారు? దానికి చరిత్రే సాక్ష్యం. ఖత్రోచి బాబాయ్ ని ఎలా ఆదుకున్న వైనం గుర్తుందా... స్వీడన్ తయారీ హోవిట్జర్ శతఘ్నలకి 1984 లో మన సైన్యం టెండర్ పిలిచింది. ఫ్రెంచి సోష్మా గన్స్ కూడ సరఫరాకై ముందుకొచ్చింది. వీరి రేంజి 30 కిమీ అవగా, భోఫోర్స్ రేంజి 22 కిమీ ఉన్నప్పటికీ తెరవెనుక భాగవతుల పలుకుబడితో భోఫోర్స్ కే దక్కి, మధ్య దళారిగా ఉన్న ఖత్రోచి బాబాయి కి 3 పర్సంట్ కమిషన్ లెక్కన 7 మిలియన్ డాలర్లు దక్కినాయి. ఇదంతా బయటకి పొక్కి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతయ్యింది. దీన్లో ప్రధాన పాత్రధారులందరు ముక్తకంఠంతో మల్లె పువ్వులం మేము అని కోరస్ అలాపించారు. అసలు సుష్మ మీద ఒంటికాలు మీద లేస్తున్న సోనియమ్మ 1999లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖత్రోచిని సమర్థించడం అంతకు ముందు 1993 లో ఢిల్లీ నుంచి కౌలంపూర్ ఖత్రోచీ చల్లగా జారుకోవడం అంతా బహిరంగ రహస్యమే. ఇన్ని కోట్ల స్కాం నీడలు రాజీవ్, సోనియా కుటుంబాన్ని నీడలా వెంటాడిన విషయం ప్రతిపక్ష హోదాలేని విపక్ష నాయకురాలు గయ్ గయ్ మని గట్టిగా మాట్లాడుతుంటే గతం జ్నాపకం వచ్చి నెమరువేసుకోవాల్సి వచ్చింది. ఏమీ లేదు... వడ్ల గింజలో బియ్యపు గింజ.