తలసాని జస్ట్ మిస్

December 07, 2015 | 02:54 PM | 1 Views
ప్రింట్ కామెంట్
talasani-srinivas-yadav-escape-from-lift-collapse-niharonline

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రికి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎర్రగడ్డలోని సెయింట్ థెరిస్సా ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన ఆయన లిప్ట్ లో ప్రయాణిస్తుండగా సడన్ గా వైర్ తెగిపోయింది. దీంతో రెండో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోకి లిప్ట్ కుప్పకూలింది. ఆసమయంలో తలసానితోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా అందులో ఉన్నారు. సెక్యూరిటీ వెంటనే స్పందించి గ్రిల్స్ తొలగించి ఆయనను బయటికి తీశారు. అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే లిఫ్ట్ లో 16 మంది ఉండటంతోనే ప్రమాదం జరిగిందా లేదా మరేయితర కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ప్రమాదంలో తలసానితో పాటు మిగతావారికి కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తుంది.

                   ఇక రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తలసానికి ఫోన్ చేశారుట. తన ఆరోగ్యంపై ఆరా తీసినందుకు మర్రికి కూడా తలసాని కృతజ్నతలు చెప్పాడట. సనత్ నగర్ నుంచి పోటీ చేసిన మరిశశిధర్ రెడ్డి ని తలసాని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. అయినప్పటికీ శశిధర్ రెడ్డి రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి తలసానికి ఫోన్ చేయటం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ