డబ్బులు పంచుడు ఎన్నికల్లో గెలుచుడు సిద్ధాంతాన్ని సూత్రీకరిచింది బాబే అని విమర్శలు గుప్పించిన ఒకనాటి చెలికాడు సదరు సిద్ధాంతిని ఆరాధించిన వాడే. గూడు మారింది... పలుకూ మారింది. ప్రజాసమస్యలను పక్కనబెట్టి అవినీతిలాంటి అల్ప విషయాలపై బాబు ఆసక్తి చూపడం తలసానికి నచ్చలేదు. ఎవరి సంపాదనెంతో ఎవరికీ తెలియదు అని వైరాగ్య భావంతో తన్మయం చెందేరు. రాజకీయ పసిబాలురు ఇలాంటి మీమాంసలతో కలవరపడటం ఆచ్చెరువంది పోతూ నోరు వెళ్లబెట్టడం కొంతవరకు సరిపెట్టుకోగలం. మరి రాజకీయ చదరంగంలో ఎన్నో పాముల్ని తప్పించుకుని వ్రుద్ధిలోకి వచ్చిన ఇటువంటి ప్రౌఢలు ఇలాంటి అమాయక ప్రసంగాలను ప్రస్తావిస్తుంటే పురిట్లో సంధి కొట్టగలదు!