ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి సభ్యత్వ నమోదులతో తెలుగుదేశం పార్టీ మోతపుట్టించిన విషయం తెలిసిందే. ఆశ్చర్యకరరీతిలో పార్టీ కి అంతగా పట్టులేని(కొల్పోతున్న) తెలంగాణ లో కూడా అనుకున్నదానికన్నా ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదుకావటం తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సహాన్ని నింపుతోంది. ఇక్కడే వచ్చాయికదా అనుకున్నారేమో ఇప్పుడు తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా సభ్యత్వ నమోదు చేయాలని పార్టీ నిర్ణయించిందట. అంతేకాదు ఇందుకు సంబంధించి అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యువనేత నారా లోకేష్ ను కలిసి చర్చించారట కూడా. మార్చి నుంచి ప్రారంభించబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అక్కడ కూడా రికార్డు స్థాయిలో లక్ష వరకు సభ్యత్వాలు నమోదు చేయాలని లోకేష్ పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేశాడట. ఇవన్నీ చూస్తూంటే కొంపదీసి అక్కడ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీచేయాలని అనుకోట్లేదు కదా!