టీ సర్కార్ ‘చెత్త’ ఖర్చు మరీ అంతనా?

July 23, 2015 | 04:24 PM | 6 Views
ప్రింట్ కామెంట్
KCR_Hyderabad_GHMC_garbage_problem_niharonline

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ నుంచి ప్రేరణతో రాజధాని హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పథకం స్వచ్ఛ హైదరాబాద్. మున్సిపాలిటీ వాళ్ల స్ట్రైక్ తో కొన్నాళ్లు సుప్తావస్థలో ఉన్న ఈ పథకం ముఖ్యమంత్రిగారి పుణ్యమా అని ఇఫ్పుడు తిరగి మళ్లీ ఇది ఊపందుకుంది. భాగ్యనగరాన్ని చెత్త రహిత నగరంగా మార్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్న లక్ష్యంతో టీ సీఎం ఓ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. అయితే కేవలం ఈ పథకం కోసం చేస్తున్న ఖర్చు తెలిస్తే మాత్రం నోళ్లు వెళ్లబెట్టడం ఖాయం. దాదాపు వంద కోట్లకు పైగానే ఇప్పటికే ఖర్చు చేసిన ఈ పథకం ఇంకా ప్రారంభదశలోనే ఉందన్నది నమ్మలేని నిజం. ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉన్నప్పటికీ  కాంట్రాక్టర్ల నిర్లక్ష్యధోరణి, కక్కుర్తితో నిధులలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయినా ఓవైపు పనులు కాస్త చకచకా జరగటం మాత్రం ఇక్కడ ఊరట కలిగించే విషయం. ఇలాంటి సమయంలో ఈ పథకంపై ప్రకటించిన మరో జీవో ఆశ్చర్యం కలిగించక మానదు.  అదే చెత్త తరలింపు కోసం నగరంలోని ప్రతీ ఇంటికి రెండు చెత్త డబ్బాలు ఫ్రీగా అందించాలన్న నిర్ణయం.  ఓ డబ్బాలో తడి చెత్తను, మరో డబ్బాలో పొడి చెత్తను నిల్వ చేస్తే వేర్వేరుగా పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఆ చెత్తను సేకరిస్తారట. ఇంత వరకు బాగానే ఉంది పథకం మంచిదే కానీ, ఈ డబ్బాల కొనుగోలుకు ఏకంగా రూ.42 కోట్లు ఖర్చు చేయటమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఖజానా పరిస్థితి పై విమర్శలు వస్తున్న ఈ సమయంలో ఇలా చెత్త డబ్బాల కోసం ఏకంగా ఇన్నేసి కోట్లు ఖర్చు చేయడం సాధ్యమేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. హైదరాబాద్ లో ట్రాఫిక్, డ్రైనేజీ, రోడ్లు లాంటి సమస్యలు ఏళ్ల తరబడి జిడ్డులా నగరాన్ని పట్టిపీడుస్తుంటే ఇలా ‘చెత్త’ కోసం తాపత్రయపడటం ఏంటని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ