అల్లర్ల సాకుతో ఆ సెక్షన్ మళ్లీ తెరపైకి

February 03, 2016 | 05:05 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Jana Reddy on section 8 GHMC election clashes

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్ల గురించి తెలసిందే. పాతబస్తీలోని పురానాపూల్ లో కాంగ్రెస్, మజ్లిస్ కార్యకర్తల తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గాయపడ్డారు. దీని ప్రభావం హైదరాబాద్ లోని మరికొన్ని ఏరియాలో పడగా, చిన్నచితకా గొడవలు అక్కడక్కడా జరిగాయి. అయితే వీటిని సాకుగా చూపుతూ మరుగున పడిపోయిన సెక్షన్-8 ని తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

హైదరాబాద్ లో శాంతి భద్రతల అదుపులో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలే నిదర్శనమని అఖిలపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే సెక్షన్-8 ని అమలుచేయాలని,  ఈ విషయమై గవర్నర్ నరసింహన్ తక్షణం జోక్యం చేసుకోవాలని అఖిలపక్షనేతలు జానారెడ్డి, లక్ష్మణ్, ఎల్.రమణ, శివకుమార్ కోరారు. సెక్షన్ 8 అమలు చేయడం ద్వారా హైదరాబాద్ లో శాంతిభద్రతలను పరిరక్షించాలని వారు కోరారు. ఈ విషయమై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను త్వరలో కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని వారు తెలిపారు.

సెక్షన్ -8 ముఖ్య ఉద్దేశం గవర్నర్ కి విశిష్ట అధికారాలను కట్టబెట్టడం. అందుకు ఏ ముఖ్యమంత్రి ఒప్పుకోడు. అలాగే గతంలో ఈ డిమాండ్ తెరమీదకు వచ్చినప్పుడు ఒప్పుకోని కేసీఆర్ ఇప్పుడు అఖిల పక్షాల ఆరోపణలను లైట్ తీసుకుంటారనే ఆశిద్దాం. ఇక్కడ హైలెట్ ఏంటంటే... అప్పుడు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు సెక్షన్-8 విధించాల్సిందేనని డిమాండ్ చేయగా, కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ టీడీపీతో కలిసి అమలు చేయాల్సిందేనని కొరడ విడ్డూరంగా ఉంది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ