విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాం. ఆ పన్నులను ఆదుకునే విషయంలో ఆయన టీం సభ్యులతోసహా ముందుంటున్నాడు. రైతు సంక్షేమ సమితి అధ్యక్షులుగా, ఒక మానవతావాదిగా ప్రభుత్వం చేసే పుల్లయ్య వ్యవహారాన్ని మండుటెండలో ఎండగడుతున్నారు. మాట పొందిక లేకపోతే ఆ ఒక్క పొరపాటు రైతుల మానసిక స్థితిపై ప్రభావం చూపించి బొందలగడ్డ వరకు తీసుకుపోతోంది.
స్వయం హత్యలు ధర్మం కాదు ప్రభుత్వం ఆదుకుటుంది అని చెప్పటం చేతగాక రైతన్నలు చనిపోతే అనే స్టేట్ మెంట్లు ఇవ్వటం మూలానా ఘోరాలు జరిగిపోతున్నాయి. అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, అంతంత మాత్రంగా చదువుకున్నవాళ్లు, జీవితం పై విసిగి వేసారి ఉన్నారు, దిక్కులు తోచక నాలుగు దిక్కులు వెర్రి చూపులు చూస్తున్నారు. ఇదంతా అన్నదాత గురించే. దీంతో ఛస్తే పీడవిరగడవుతుంది. భార్యాబిడ్డల కింత బువ్వ దొరుకుతుంది అని సంబరపడిపోతూ ఉసురు తీసుకుంటున్నాడు, ఇదంతా ప్రభుత్వ పరిహారంపై నమ్మకంతోనే! అదీ సంగతి. ఈ విషయంపైనే చంద్రకుమార్ కి చిర్రెత్తుకొచ్చింది.