ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కార్ చేతికి కీలక సమాచారం చిక్కిందట. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపేందుకు అనుబంధ కౌంటర్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి బుధవారం హైకోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఏసీబీ కూడా తన కౌంటర్ నిన్ననే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వడమో, పిటిషన్ ను కొట్టివేయడమో జరుగుతుందని అందరూ భావించారు. అయితే తెలంగాణ సర్కార్ కొత్త విషయాన్ని తెరపైకి తేవటంతో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడక తప్పలేదు. మరి తెలంగాణ ప్రభుత్వం చేతికి చిక్కిన ఆ కీలక సమాచారం ఏంటనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చకు తెరలేచింది. లైట్ తీసుకునే దశలో ఏపీ ప్రభుత్వం సెక్షన్ 8 ను తెరమీదకు తేవటమే నోటకు ఓటు వ్యవహారంలో తెలంగాణ సర్కార్ మరింత సీరియస్ అవ్వటానికి కారణమని తెలుస్తోంది.