ప్రముఖ ఉద్యమకారిణి రాములమ్మకు సెక్షన్ 8 విషయంలో తీవ్రంగా ఉద్రిక్తురాలయిన వైనం యువలోకంలో సంచలనం రేపుతోంది. కుమారి రాములమ్మ రాష్ట్ర విభజన జరిగిపోయిన తదుపరి విభజన అఘాయిత్యానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి అంకితమయ్యారు. ఈవిడ మూలాలు ఆంధ్రలోనా, తెలంగాణలోనా అనే ధర్మసందేహం విజయలలిత స్పష్టంచేస్తే మేలని బుద్ధిజీవులు ప్రగాఢ వాంఛ, సదరు సెక్షన్ యొక్క ఉచితానుచితాలు బేరీజు వేసేందుకు పెద్ద తలకాయలు ఉండగా ఈ బరువు తలకెత్తుకునే దుస్సాహసం చేయడానికి ఎందుకు ఒడిగడుతున్నట్లు? మరో ఉద్యమం తప్పదని వార్నింగు ఎందికిస్తున్నట్లు? ఎవరికిస్తున్నట్లు? ఆలూ లేదు చూలూ లేదు కూతురు పేరు సోమలింగమ్మ అన్నట్టు! ఉద్యమం అంటే బహువెటకారంగా ఉందే!