ఇండియాలో ఎమర్జెన్సీయా? ఛాన్సే లేదు

June 24, 2015 | 03:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
arun_jaitley_about_emergency_in_india_niharonline

ఇందిరా గాంధీ హయాంలో 1975-77 సంవత్సరాల మధ్య దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దేశాన్ని, ఈ దేశ ప్రజలను రక్షించేందుకే ఎమర్జెన్సీ విధించినట్టు అప్పట్లో ఇందిరా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఎమర్జెన్సీ విధించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఆ సంఘటటను దేశ వ్యాప్తంగా నేతలు గుర్తుచేసుకోవటం కామనే. కానీ, కమల కురువృద్ధుడు అద్వానీ మాత్రం కాస్త ఈ విషయంలో సీరియస్ గానే స్పందించారు. నియంతృత్వ పాలనను పక్కనబెట్టి అందరినీ కలుపుకొని పోవాలని, లేకుంటే పాలనా పరంగా సమస్యలు తలెత్తి అత్యవసర పరిస్థితులు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు. దీనిపై దేశ వ్యాప్త దుమారం చెలరేగింది. ప్రధాని మోదీపై పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలపట్ల శత్రువులైన ఢిల్లీ, బీహార్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, నితీశ్ కుమార్ లు అద్వానీ వ్యాఖ్యలకు మద్ధుతు పలికారు. అయితే అవి ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని తర్వాత చెప్పటం కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఎమర్జెన్సీ మీద ఓ స్టేట్ మెంట్ ఇచ్చిపడేశారు. స్వతంత్ర్య భారతదేశంలో ఆ చీకటి రోజులు మళ్లీ రావలనుకోవటం లేదని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నియంతృత్వ దేశంగా మారటం అన్నది సాధ్యమయ్యే పనికాదు. పైగా ఈ వేళ అస్సలు సాధ్యం కాదంటూ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. అయితే పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అత్యవసర పరిస్థితులు విధించటం పరిపాటే అని చివర్లో అనటం కొసమెరుపుగా చెప్పుకొవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ