పొలిటికల్ గేమ్ తో ప్రతీకారం తీర్చుకుంటాడా?

May 07, 2016 | 04:14 PM | 1 Views
ప్రింట్ కామెంట్
vijay-political-game-against-jaya-niharonline

తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే అంశాల్లో స్టార్ల మద్ధతు కూడా ఓ ప్రధానాంశంగా మారిపోయింది. జనాల్లో సినీ సెలబ్రిటీలకు అక్కడ ఉన్న ప్రాధాన్యం అంత మరి! ఇక రానున్న శాసనసభ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారనుంది. అధికార అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య నువ్వా? నేనా? అన్నంత పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో స్టార్ నటుడు విజయ్ మద్దతు దేనికనేది ప్రశ్నగా మారింది.

గత రెండు దఫా ఎన్నికల్లో అన్నాడీఎంకే కు మద్ధతు ప్రకటించిన విజయ్ ఆయన అభిమానులు ఇప్పడు డీఎంకే వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనికి బలమైన కారణం ఉంది. గత ఐదేళ్లలో విజయ్ చిత్రాలు పలు ఇబ్బందులకు గురయ్యాయి. దీనికి కారణం అన్నాడీఎంకే ప్రభుత్వమేననే నిర్ణయానికి విజయ్ అభిమానులు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీంతో వారు అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పులి చిత్ర విడుదల సమయంలో విజయ్ ఇంటిలో ఐటీ దాడులు జరగడంలో ప్రభుత్వ ప్రయేయం ఉందని విజయ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన అభిమానులు అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నట్లు సమాచారం. గత 2004 పార్లమెంట్ ఎన్నికల సమయంలో విజయ్ అభిమానసంఘం బీజేపీకి మద్దతు తెలిపింది. 2011 శాసనసభ ఎన్నికల్లో విజయ్,ఆయన తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖర్‌లు బహిరంగంగానే అన్నాడీఎంకేకు మద్దతు పలికారు.

అలాంటిది ఈ ఐదేళ్ల కాలంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులు వారి అభిమానులకు అన్నాడీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత, అసంతృప్తిని కలిగించాయంటున్నారు. ఇప్పుడు టైం రావటంతో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా డీఎంకే కు మద్ధతు ఇవ్వాలన్న యోచనలో ఉన్నారంట. అంతేకాదు విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు డీఎంకే సీటు ఇవ్వటం ఈ విషయాన్ని దాదాపు కన్ఫర్మ చేస్తుంది. అయితే దీనిపై విజయ్ నుంచి గానీ, ఆయన తండ్రి చంద్రశేఖర్ నుంచి గానీ ఎటువంటి ప్రకటన వెలువడకపోవటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ