హైదరాబాద్ పై అనువాదకుడు మళ్లీ కెలుకుతున్నాడు!

June 26, 2015 | 03:30 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Undavalli_Arun_Kumar_on_hyderabad_niharonline

ఓవైపు తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో రాజధాని హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చెయ్యాలన్న డిమాండ్ ఆంధ్రానేతల నోటివెంట విన్నాం. వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు. ప్రతీ దాన్ని లెక్కలతో సహా మాట్లాడాలని ప్రయత్నించే ఆయన లగడపాటి తరహాలో నేరుగా ఎప్పుడూ తెలంగాణ వాదుల నుంచి విమర్శలు ఎదుర్కొలేదు. తెలంగాణకు అడ్డుపడి తీరాతానని, అవసరమైతే తాను బలిదానమౌతానని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడీ ఉత్తమ అనువాదకుడు. ఎదేమైనా చివరికి తెలంగాణ సిద్ధించటంతో తదనంతరం ఉండవల్లి రాజకీయ సన్యాసం తీసుకోవటం జరిగిపోయాయి. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఓ హాట్ టాపిక్ రెండింటినీ కుదిపిపారేస్తోది. అయితే దీనిని సాకుగా చేసుకుని మళ్లీ  తెరపైకి వచ్చిన ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీయటంతోపాటు, ఇప్పుడు నేరుగా తెలంగాణ నేతల ఆగ్రహానికి గురికాక తప్పదేమో అనిపిస్తోంది. ఇంతకీ ఆయనేమంటున్నారంటే... హైదరాబాద్ ను శాశ్వతంగా తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిని చెయ్యాలంటున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ ను యూటీ చెయ్యటంతోపాటు దేశానికి రెండో రాజధానిని చెయ్యాలని కోరుతున్నారు. అంతేకాదు టీడీపీకి సెక్షన్ 8 గురించి ఇప్పుడైనా గుర్తురావటం సంతోషకరంగా ఉందని, ఈ మేరకు వారితో కలిసి పోరాడేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. పార్లమెంటులో విభజన బిల్లు ప్రకారం పాస్ కాలేదని, దీనిపై తాను ఇప్పటికీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నానని ఆయన చెబుతున్నారు. మరి తెలంగాణ(నేతల) తరపు నుంచి ఏమేర తీవ్ర వ్యాఖ్యలు ఈ ఉత్తమ అనువాదకుడి పై పడతాయో వేచిచూడాలి.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ