రామోజీరావు పద్మవిభూషణ్ వెనక్కి?

February 11, 2016 | 12:26 PM | 3 Views
ప్రింట్ కామెంట్
undavalli-ramoji-rao-padmavibhushan-return-niharonline

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఉన్న సంగతి తెలిసిందే. మీడియా రంగంలో చేసిన సేవలకు ఆయనకు ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ ను కేంద్రం ప్రకటించింది.  తెలుగు వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవమంటూ పలువురు రాజకీయ నేతలతోసహా ప్రముఖులు కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు. అయితే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  మాత్రం రామోజీరావుపై గురువారం సంచలన ఆరోపణలు చేశారు.

                                  ఆయనపై ఎన్నో ఆరోపణలు, కేసులు ఉన్నప్పటికీ పద్మవిభూషణ్ ఎలా ఇస్తారని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు కేసుల నుంచి రామోజీరావు ఇంకా బయటపడలేదని , ప్రజల నుంచి ఆయన అక్రమంగా డబ్బు వసూలు చేశారని ఉండవల్లి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కేసులు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని చెప్పిన ఉండవల్లి, ఈ విషయాలను ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అంతేకాదు మోసాలు చేసిన ఓ వ్యక్తికి అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడాన్ని తప్పుబట్టారు. తక్షణమే ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని వెనక్కు తీసుకోవాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. గతంలో తాను రామోజీరావు బాగోతాలను బయటపెట్టినప్పుడు అప్పుడు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా విచారణకు ఆదేశించారని, అది ఇంకా విచారణ దశలోనే ఉండగా అవార్డు ప్రకటించేశారంటూ, సదరు లేఖను మీడియాకు ఉండవల్లి మీడియాకు విడుదల చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ